Divvala Madhuri Politics: తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ..
ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న దివ్వల మాధురి తాను తెలంగాణ రాజీకీయాల్లోకి వస్తానని, పోటీ చేస్తానని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Divvala Madhuri)
- Saketh U
- Updated on- June 2, 2026 / 12:07 PM IST
Divvala Madhuri to Contest in Telangana Elections
Divvala Madhuri : ఏపీ రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ తో ఉంటూ బాగా వైరల్ అయింది దివ్వల మాధురి. బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ, చీరల బిజినెస్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, దువ్వాడ శ్రీనివాస్ వెంట రాజకీయాల్లో తిరుగుతూ వైరల్ అవుతుంది మాధురి.
ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న దివ్వల మాధురి తాను తెలంగాణ రాజీకీయాల్లోకి వస్తానని, పోటీ చేస్తానని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
దివ్వల మాధురి ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. ఏపీలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కరే పోటీ చేస్తారు. ఒకవేళ నేను పోటీచేస్తే కనక తెలంగాణలోనే పోటీ చేస్తా. ఆల్రెడీ తెలంగాణలో నాకు ఆఫర్స్ ఉన్నాయి. అందుకనే నేను చేస్తే తెలంగాణలో పోటీ చేస్తాను. ఆంధ్రాలో మాత్రం కేవలం దువ్వాడ శ్రీనివాస్ గారే చేస్తారు. ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను. తెలంగాణలో ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందో ఇప్పుడే చెప్పను. ఒకవేళ అధికారికంగా జాయిన్ అయి పోటీచేస్తే అప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. నాకైతే తెలంగాణ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి అని తెలిపింది.
మరి వచ్చే ఎన్నికల్లో దివ్వెల మాధురి తెలంగాణలో ఏ పార్టీ నుంచి ఎక్కడ్నుంచి పోటీ చేస్తుందో చూడాలి.
Also Read – Peddi Event : హైదరాబాద్ లో ‘పెద్ది’ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
