VD13 Movie : విజయదేవరకొండ మృణాల్ ఠాకూర్ సినిమా VD13లో మరో హీరోయిన్.. ఫుల్ స్వింగ్ లో షూటింగ్..

ఇటీవలే ఈ VD13 సినిమా షూట్ కూడా మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతున్నట్టు సమాచారం.

Divyansha Kaushik will play a key role in Vijay Devarakonda Parusuram Mrunal Thakur VD13 Movie

Divyansha Kaushik :  విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) త్వరలో సమంత(Samantha)తో కలిసి శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత VD12 జెర్సీ(Jersy) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఇక విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది.

గతంలో పరుశురాం – విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుండటంతో దీనిపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇటీవలే ఈ VD13 సినిమా షూట్ కూడా మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతున్నట్టు సమాచారం. విజయ్ లైగర్ ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు ఇలా వరుసగా సినిమాలు చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Lokesh Kanagaraj : సూర్యతోనే నా డ్రీం ప్రాజెక్ట్.. ఆల్రెడీ కథ కూడా రాసుకున్నా.. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..

తాజాగా VD13 సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని సమాచారం. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ విజయదేవరకొండతో ఈ సినిమాలో నటించనుంది. దివ్యాంశ కౌశిక్ ఆల్రెడీ తెలుగులో మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్, టక్కర్ సినిమాలతో మెప్పించింది. ఇప్పుడు విజయ్ సరసన VD13 సినిమాతో అలరించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు