Arya : అల్లు అర్జున్ ఆర్య తెలుసు.. మరి మాధవన్ ఆర్య సినిమా గురించి తెలుసా?
తెలుగులో మరో ఆర్య సినిమా కూడా వచ్చింది. (Arya)
- Saketh U
- Published On : March 18, 2026 / 05:30 PM IST
Arya
Arya : అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఆర్య ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో 2004 వచ్చిన ఆర్య సినిమా భారీ విజయం సాధించి అల్లు అర్జున్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆర్య 2 కూడా చేసారు. అయితే తెలుగులో మరో ఆర్య సినిమా కూడా వచ్చింది.
తెలుగులో ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా, అమ్మాయి బాగుంది.. లాంటి పలు సినిమాలు తీసిన తమిళ దర్శకుడు బాలశేఖరన్. తమిళ్ లో మాధవన్, భావన జంటగా ఆర్య అనే సినిమా చేసారు. ఆ సినిమా తమిళ్ లో మంచి హిట్ అయింది. అప్పట్లో మాధవన్ కి తెలుగులో కూడా ఉన్న క్రేజ్ తో ఆ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసారు.
Also Read : Peddi: ఒకరు కాదు ఇద్దరు స్టార్స్.. పెద్ది స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా.. బుచ్చిబాబు మామూలోడు కాదు
2007లో మాధవన్ ఆర్య సినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వగా తెలుగులో 2008లో రిలీజ్ చేసారు. అయితే ఆల్రెడీ ఇక్కడ ఆర్య టైటిల్ తో అల్లు అర్జున్ సినిమా ఉంది కాబట్టి మాధవన్ సినిమాకు MBBS జోడించి ‘ఆర్య MBBS’ అనే టైటిల్ తో ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. కానీ తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయింది.
