Do you know Karthi How save the phone number of his brother Suriya
Unstoppable 4 : బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ సైతం పుల్ జోష్‌తో అలరిస్తోంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. హీరో సూర్య అతిథిగా వచ్చారు. తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి పలు ఆసక్తికర విషయాలను సూర్య పంచుకున్నారు.
బాలయ్య వేసిన ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానాలు ఇచ్చారు. సూర్య ఫోన్ నంబర్‌ను ఆయన తమ్ముడు కార్తి ఏమని సేవ్ చేసుకుంటారని బాలయ్య ప్రశ్నించారు. వెంటనే సూర్య మొదటి ప్రశ్నననే అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అంటూ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అన్నా అని సేవ్ చేసుకుంటాడని సూర్య రాసి చూపించారు.
Chandini Chowdary : హీరోయిన్ చాందిని చౌదరికి గాయం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలుగమ్మాయి..
మొదటి క్రష్ ఎవరు అని బాలయ్య మరో ప్రశ్న వేశారు. వద్దు సర్ ఇంటికి వెళ్లాలి.. గొడవలు అవుతాయ్ అని సూర్య అన్నారు. కార్తికి ఫోన్ చేశారు బాలయ్య. ఇక సూర్య రాసిన సమాధానాలు కరెక్టో కాదో అని తెలుసుకున్నారు.
ఓ హీరోయిన్ అంటే సూర్యకు ఇష్టం అని కార్తి చెప్పాడు. దీంతో నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా అని సూర్య అన్నారు. ఇక కంగువా టీమ్.. దర్శకుడు శివ, నటుడు బాబీదేవోల్ సైతం పాల్గొన్నారు.
Devara OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దేవర’.. ఏ రోజు, ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?