Devara OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దేవర’.. ఏ రోజు, ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘దేవర’.

Jr NTR Devara OTT Release date fix streaming in Netflix
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారికి శుభవార్త అందింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Samantha : బరువు తగ్గడం పై నెటిజన్ వ్యాఖ్య.. ఫైర్ అయిన సమంత..
తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను వెల్లడించింది. నవంబర్ 8 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
Dulquer Salmaan : లక్కీ భాస్కర్ సినిమా ఎందుకు చేసాడో చెప్పిన దుల్కర్ సల్మాన్..