T20 World Cup 2026 : శ్రీలంక జట్టు విజయాల వెనుక ఆ ఇద్దరు మాజీ భారత కోచ్‌లు..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 ) ఆస్ట్రేలియా జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది.
Jayasuriya explained how two Indian coaches helped him shape this Sri Lankan side
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది. పల్లెకల్లె వేదికగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో లంక జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. మరో వైపు ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
గత రెండు టోర్నమెంట్లలో శ్రీలంక జట్టు గ్రూప్ దశలలోనే నిష్ర్కమించింది. అయితే.. టీ20 ప్రపంచకప్2026లో సూపర్-8కి శ్రీలంక జట్టు అర్హత సాధించడంతో హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఆనందాన్ని వ్యక్తం చేశాడు. లంక జట్టు విజయాల వెనుక ఇద్దరు మాజీ భారత జట్టు మాజీ కోచ్‌లు ఉన్నారని, వారి కృషిని కొనియాడాడు. వారు మరెవరో కాదు ఆర్ శ్రీధర్, విక్రమ్ రాథోడ్.
టీ20 ప్రపంచకప్ 2026కి కొద్ది రోజుల ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్ శ్రీధర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా, విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే.
‘ఆర్ శ్రీధర్ మా ఫీల్డింగ్ కోచ్. విక్రమ్ రాథోర్ మా బ్యాటింగ్ కోచ్. వీరిద్దరూ భారత్‌కు చెందిన వారు. వీరిద్దరు ఎంతో నిబద్దత కలిగిన వారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో వారు ఆటగాళ్లతో కలిసి పోయి సరైన మార్గ నిర్దేశం చేస్తున్నారు. మా ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది. ఇక బ్యాటర్లకు కూడా ఎంతో స్వేచ్ఛ ఇచ్చాము. కొన్ని సార్లు విఫలమైనా సరే.. వారికి మద్దతుగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాము. విక్రమ్, శ్రీధర్ లు ఎంతో మంచి వారు. ‘అని ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జయసూర్య అన్నాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో మొదటి ఎనిమిది ఓవర్లలోనే 100 పరుగులు సమర్పించుకున్నప్పటికి ఆ తరువాత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని జయసూర్య తెలిపాడు. ప్రధాన పేసర్ మతీషా పతిరాణా గాయపడినప్పటికి కూడా ఆసీస్‌ను 181 పరుగులకే పరిమితం చేయడం బాగుందన్నాడు.
