Mahesh Babu Cap : వామ్మో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతో తెలుసా? ఏకంగా..
ఈ ఫొటోలో మహేష్ బాబు ఓ క్యాప్ పెట్టుకున్నాడు. (Mahesh Babu Cap)
- Saketh U
- Published on- August 11, 2026 / 04:35 PM IST
Mahesh Babu Cap
Mahesh Babu Cap : మన సెలబ్రిటీల వస్తువులు చాలా ఖరీదైనవి అని అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు వేసుకునే డ్రెస్ లు, షూస్, వాచ్ లు లక్షల్లో కూడా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర వైరల్ అవుతుంది.
ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక చోప్రా మహేష్ తో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోలో మహేష్ బాబు ఓ క్యాప్ పెట్టుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆ క్యాప్ గురించి వెతుకులాట మొదలుపెట్టారు.
మహేష్ పెట్టుకున్న క్యాప్ జిగ్నా అనే ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ క్యాప్. దీని ఖరీదు దాదాపు 80 వేల రూపాయలు. డెలివరీ చార్జీలతో కలిపి 82 వేల రూపాయల వరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. దీంతో ఒక్క క్యాప్ ఖరీదు ఏకంగా 80 వేల రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. Zegna – Oasi baseball Cap అని ఇంటర్నెట్ లో వెతికితే ఈ క్యాప్ దొరుకుతుంది. కావాలనుకున్నవారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు.
