Ramba Oorvasi Menaka Teaser : అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేసింది.. రంభ ఊర్వశి మేనకలు భూమి మీదకు వస్తే..
మీరు కూడా రంభ ఊర్వశి మేనక టీజర్ చూసేయండి.. (Ramba Oorvasi Menaka Teaser)
Ramba Oorvasi Menaka Teaser
Ramba Oorvasi Menaka Teaser : అల్లరి నరేష్, సురభి జంటగా తెరకెక్కుతున్న సినిమా రంభ ఊర్వశి మేనక. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మాణంలో చంద్ర మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ తో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా రంభ ఊర్వశి మేనక టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ లు, ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే హీరోకి చిన్నప్పుడు ఓ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ మీద కరెక్ట్ గా ముగ్గు గీస్తే రంభ ఊర్వశి మేనకలు కిందకు వచ్చి ఏం కావాలన్నా ఇస్తారు. దాంతో ఓ పాతికేళ్ళు ట్రై చేస్తూ, రంభ ఊర్వశి మేనకలకు పూజలు చేస్తూ ఉన్న హీరోకు ఎట్టకేలకు రంభ ఊర్వశి మేనకలు కిందకు దిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని కామెడీ సినిమాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
Also See : Shivathmika Rajashekar : సరికొత్త షార్ట్ హెయిర్ స్టైల్ తో శివాత్మిక రాజశేఖర్.. ఫొటోలు..
మీరు కూడా రంభ ఊర్వశి మేనక టీజర్ చూసేయండి..
