Mehreen Pirzada : ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేతో ఎంగేజ్మెంట్.. ఇప్పుడు వేరేవ్యక్తితో హీరోయిన్ మెహరీన్ పెళ్లి..

మెహరీన్ కి ఐదేళ్ల క్రితమే ఓ వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకొని ఆ తర్వాత విడిపోయింది. (Mehreen Pirzada)

  • Published on- April 27, 2026 / 06:42 AM IST

Mehreen Pirzada

Mehreen Pirzada : హీరోయిన్ మెహరీన్ పిర్జాదా సడెన్ గా పెళ్లి చేసుకొని తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అసలు తన లవ్ గురించి ఎలాంటి రూమర్స్ రాలేదు. కాబోయే భర్తతో ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు, కనీసం ఎంగేజ్మెంట్, పెళ్లి పనుల గురించి కూడా ఏమి చెప్పకుండా సడెన్ గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు.

మెహరీన్ అర్ష్‌ ఔలఖ్‌ అనే పంజాబీ నటుడిని హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. అయితే మెహరీన్ కి ఐదేళ్ల క్రితమే ఓ వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకొని ఆ తర్వాత విడిపోయింది.

Also See : Mehreen Pirzada : సడెన్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు వైరల్..

2021 లో హీరోయిన్ మెహరీన్ హర్యానాకు చెందిన ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ ని ప్రేమించింది. వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయాన్ని మెహరీన్ స్వయంగా ప్రకటించింది. అప్పట్లో తన బాయ్ ఫ్రెండ్ భవ్య బిష్ణోయ్ తో సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేసేది.

కానీ వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో నిశ్చితార్థం చేసుకున్న కొన్ని నెలలకే భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ విడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడలేదు. సడెన్ గా నిన్న ఏప్రిల్ 26న అర్ష్ ఔలఖ్ ని పెళ్లి చేసుకొని ఫోటోలు షేర్ చేసింది. ఇక భవ్య బిష్ణోయ్ మెహరీన్ తో బ్రేకప్ అయ్యాక ఓ ఐపీఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకున్నాడు.

Also Read : Mamitha Baiju : ‘కర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మమిత బైజు క్యూట్ ఫొటోలు..