Balakrishna : బాలయ్య సినిమా టైటిల్ కోసం ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ ఫైట్.. ఏకంగా కోర్టుకు.. అదేం సినిమానో తెలుసా?

గతంలో బాలకృష్ణ - రమేష్ బాబు సినిమాలు ఒకే టైటిల్ పెట్టుకోవడంతో పెద్ద వివాదమే నడిచింది. (Balakrishna)

  • Published On : March 13, 2026 / 03:00 PM IST

Balakrishna

Balakrishna : సినీ పరిశ్రమలో ఒకే టైటిల్ కోసం రెండు సినిమాలు పోటీ పడుతుండటం మాములే. ఇటీవల కొన్ని సినిమాలు ఒకే టైటిల్ కోసం పోటీ పడటం, చివరి నిమిషంలో టైటిల్ మార్చడం లేదా టైటిల్ ముందు ఏదో ఒకటి జతచేయడం జరుగుతుంది. ఈ టైటిల్ గొడవలు ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితం నుంచే ఉన్నాయి. గతంలో బాలకృష్ణ – రమేష్ బాబు సినిమాలు ఒకే టైటిల్ పెట్టుకోవడంతో పెద్ద వివాదమే నడిచింది.

సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుని 1987లో హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్ ని కృష్ణ ముందే రిజిస్టర్ చేయించారు.

Also Read : Chiranjeevi: మెగాస్టార్‌ను ఫిదా చేసిన శ్రీనివాస్ మాయ కథ.. సుకుమార్ శిష్యుడికి బంపర్ ఆఫర్.. రంగస్థలాన్ని మించి ఉంటుందా?

అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సామ్రాట్ అనే టైటిల్ తోనే సినిమా మొదలుపెట్టారు. వీళ్ళు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించలేదు. ఈ విషయం కృష్ణకు తెలిసి బాలకృష్ణ సినిమా నిర్మాత శేఖర్ బాబుతో మాట్లాడారు. నేను టైటిల్ రిజిస్టర్ చేయించాను అని కూడా చెప్పినా ఆ నిర్మాత వినలేదు. బాలకృష్ణ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ తోనే ప్రమోషన్స్, యాడ్స్ ఇవ్వడం కూడా చేసారు.

దీంతో ఈ టైటిల్ వివాదంగా మారింది. రెండు సినిమాలు కూడా సామ్రాట్ అనే టైటిల్ తోనే ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో ఈ టైటిల్ వివాదం కాస్తా ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అయింది. ఇద్దరూ ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ టైటిల్ కోసం కోర్టుకు కూడా వెళ్లారు. చివరికి సినీ పరిశ్రమలోని కొంతమంది పెద్దలు ఎన్టీఆర్ తో రాయబారం చేయడంతో, కృష్ణ ముందే టైటిల్ రిజిస్టర్ చేయించాడు అని చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. దాంతో బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ అనే టైటిల్ పెట్టుకున్నారు. రమేష్ బాబు సినిమా సామ్రాట్ అనే టైటిల్ తోనే విడుదల అయింది.

Also Read : Vijay: విజయ్ కి షాక్ ఇచ్చిన కొడుకు.. తండ్రి పేరును తొలగించిన జాసన్ సంజయ్.. తల్లికి సపోర్ట్ గానే