Rakul Preet Singh : నేషనల్ లెవల్ ప్లేయర్.. కానీ ఆ గేమ్ ని వదిలేసింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

తాజాగా తన భర్తతో కలిసి బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది. (Rakul Preet Singh)

  • Published on- April 25, 2026 / 04:05 PM IST

Rakul Preet Singh

Rakul Preet Singh : ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తూ అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తుంది రకుల్. తాజాగా తన భర్తతో కలిసి బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.

రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. నేను 10 ఏళ్ళ వయసు నుంచే గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టాను. జూనియర్ టీమ్ గా నేషనల్ లెవల్ లో కూడా గోల్ఫ్ ఆడాను. కానీ నేను మోడల్ అవ్వాలి, నటి అవ్వాలి అనుకున్న తర్వాత 18 ఏళ్ళ నుంచే మోడల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టాను. దాంతో గోల్ఫ్ ని ఆపేసాను. గోల్ఫ్ ఆడటం వల్ల నా శరీరం రంగు మారిపోతుంది. మోడల్ గా ఉండాలంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లుక్స్ బాగుండాలి. అందుకే గోల్ఫ్ ఆడటం ఆపేసాను. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ కాకపోయినా అప్పుడప్పుడు సరదాగా ఆడతాను అని తెలిపింది.

Also Read : Lavanya Tripathi : లావణ్య ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు చేసిన సినిమా.. మెగా కోడలు వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..

దీంతో రకుల్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. శరీరం రంగు పోతుందని గోల్ఫ్ మానేయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఒకవేళ రకుల్ సినిమాలోకి రాకపోతే కచ్చితంగా ఒక మంచి నేషనల్ గోల్ఫ్ ప్లేయర్ అయ్యేదేమో అని అభిప్రాయపడుతున్నారు. కానీ తాను హీరోయిన్ అవ్వడానికి గోల్ఫ్ వదిలేసింది కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది అని అంటున్నారు.