Lavanya Tripathi : లావణ్య ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు చేసిన సినిమా.. మెగా కోడలు వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘సతీ లీలావతి’. (Lavanya Tripathi)
Lavanya Tripathi
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి, బాబు పుట్టడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాను చేసిన సినిమా సతీ లీలావతి ఇప్పటికే వాయిదా పడింది. లావణ్య ఈ సినిమా చేసేటప్పుడు ప్రగ్నెంట్ గా ఉంది. ప్రగ్నెన్సీతోనే ఈ సినిమా షూట్ చేసిందని లావణ్య గతంలో తెలిపింది. ఆల్రెడీ వాయిదా పడిన సతీ లీలావతి సినిమా కొత్త రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మాణంలో భీమిలీ కబడ్డీ జట్టు, SMS ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకరించారు.
Also See : Vithika Sheru : చెల్లి పిల్లలతో క్యూట్ ఫోటోలు.. షేర్ చేసిన వితిక షేరు..
రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ బలంగా ఉండాలి. ఇలాంటి అంశంతో సతీ లీలావతి సినిమాని భార్య, భర్త మధ్య ఉండే అనుబంధంతో ఎమోషనల్‌గా, కామెడీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. సీనియర్ నటుడు నరేశ్, సప్తగిరి, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్రన్, జాఫర్, జోషి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

