The Paradise OTT : నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

The Paradise OTT : నాని నటించిన ది ప్యారడైజ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది.

Do you know which OTT platform get rights of Nani The Paradise movie

The Paradise OTT : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ది ప్యార‌డైజ్. కయదు లోహర్ క‌థానాయిక‌. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్ర‌లో న‌టించారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి కుల్‌క‌ర్ణి, ఈశ్వ‌రీ రావు, సంపూర్ణేశ్ బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ చిత్రం నేడు ( సెప్టెంబర్ 24) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది.

ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వ‌స్తుంది అన్న విష‌యం తెలిసిపోయింది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టైటిల్ కార్డు ద్వారా తెలిసింది.

The Paradise Review : ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ.. జడల్ పాత్ర‌లో నాని వైలెన్స్ ఎలా ఉంది..?

థియేటర్లలో ఈ మూవీ విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలుస్తోంది. అంటే.. అక్టోబర్ మూడో వారంలో లేదంటే ఆ త‌రువాత‌నే స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల‌లో అందుబాటులో ఉండ‌నుంద‌ని స‌మాచారం.