Dulquer Salmaan : తన బర్త్‌డేకి సాలిడ్ గిఫ్ట్ ఇచ్చుకున్న స్టార్ హీరో..

పుట్టినరోజుకి తనకు తానే ఓ కాస్ట్లీ అండ్ సాలిడ్ గిఫ్ట్ ఇచ్చుకున్నారు..

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్.. మాలీవుడ్ యంగ్ స్టార్.. మాతృభాష మలయాళంతో పాటు హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లోనూ యాక్ట్ చేసి టాలెంటెండ్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్‌గా దుల్కర్ తన 35వ బర్త్‌డే జరుపుకున్నారు. పుట్టినరోజుకి తనకు తానే ఓ కాస్ట్లీ అండ్ సాలిడ్ గిఫ్ట్ ఇచ్చుకున్నారు.

Mercedes – AMG G 63 FL. వెహికల్ కొనుగోలు చేశారు దుల్కర్. ఇండియాలో దీని రేటు 2.50 కోట్లు. పైగా బుల్లెట్ ప్రూఫ్. ఐదుగురు జర్నీ చెయ్యడానికి వీలుగా లేటెస్ట్ ఫీచర్స్‌తో లగ్జీరియస్‌గా రూపొందించిన ఈ పెట్రోల్ కార్ కేవలం 5 సెకన్లలో 100 కిలోమీటర్లు చేరుకుంటుంది. దుల్కర్ కార్ తీసుకుంటున్న ఫొటోలు మెర్సిడెస్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే.. ‘మ‌హాన‌టి’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దుల్క‌ర్ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నారు. హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్షన్‌లో 1964 నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీలో దుల్కర్, లెఫ్టినెంట్ రామ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. విశాల్ చంద్ర శేఖర్ సంగీతమందిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌లో ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు