Nidhhi Agerwal : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. నిధి అగర్వాల్ ని విచారించిన ఈడీ.. 21 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు..
ఈడీ 21 మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు కేసులు నమోదు చేసి ఇప్పటికే పలువురిని విచారించారు. (Nidhhi Agerwal)
- Saketh U
- Published on- August 19, 2026 / 02:56 PM IST
Nidhhi Agerwal
Nidhhi Agerwal : బెట్టింగ్ యాప్స్ తో ఎంతోమంది డబ్బులు పోగొట్టుకోవడం, కొంతమంది ఆ బాధతో ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ పై సీరియస్ ఫోకస్ చేసారు. గతంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 21 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసారు.
ఈడీ 21 మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు కేసులు నమోదు చేసి ఇప్పటికే పలువురిని విచారించారు. తాజాగా నేడు హీరోయిన్ నిధి అగర్వాల్ ని విచారించారు. ఈడీ కార్యాలయానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ తో నిధి హాజరైంది. నిధి బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసినందుకు ప్రమోషన్ ద్వారా హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసుకున్న డబ్బును లెక్కల్లో చూపించలేదని ఈడీ అభియోగం మోపింది.
Also See : Vedha Jalandhar : లాంగ్ ఫ్రాక్‌లో వేద జలంధర్ వయ్యారాలు.. సినిమా ప్రమోషన్స్ లో..
ఓ పక్క పలువురు సెలబ్రిటీలను విచారిస్తూనే మరో 14 బెట్టింగ్ యాప్స్‌కు సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్లపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
