×
Ad

ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు.. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని..?

మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దుల్కర్‌ సల్మాన్‌ నివాసాల్లో నేడు ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. (ED Raids)

ED Raids

ED Raids : ఇటీవల భూటాన్‌ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేశారట. ఈ ఖరీదైన కార్లను ఇండియాలోని సినిమా, బిజినెస్ ప్రముఖులకు అమ్మారన్న సమాచారం రావడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేసారు.(ED Raids)

ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దుల్కర్‌ సల్మాన్‌ నివాసాల్లో నేడు ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆపరేషన్‌ నమకూర్‌ పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని ఉన్న దుల్కర్‌ ఇంట్లో సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వాహనాలు లేవని సమాచారం.

Also Read : Sujeeth : సుజీత్ చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేశారా? అందులో ఏముంది? ఏం కంటెంట్ ఇస్తాడు? OG ప్రీక్వెల్..?

అంతే కాకుండా ఈ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వారి ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తారని తెలుస్తుంది. గతంలో దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో తనకు కార్లంటే ఇష్టమని, లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయని, తన ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా కార్లు దాస్తానని చెప్పుకొచ్చాడు.