Ee Nagaraniki Emaindi 2 : యూత్ అంతా ఎదురుచూస్తున్న సినిమా.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
నేడు ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజయి 8 ఏళ్ళు అవుతుండటంతో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 'ఈNఈ రిపీట్' రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Ee Nagaraniki Emaindi 2)
- Saketh U
- Published on- June 29, 2026 / 02:28 PM IST
Ee Nagaraniki Emaindi 2
Ee Nagaraniki Emaindi 2 : 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రిలీజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ప్రకటించారు.
ఎనిమిదేళ్లుగా అదిగో ఇదిగో అంటూ ఇటీవలే కొన్ని నెలల క్రితం ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టారు. పార్ట్ 1లో ఉన్న నటీనటులంతా ఈ సినిమాలో కొనసాగుతున్నారు. సాయి సుశాంత్ రెడ్డి ప్లేస్ లో శ్రీనాథ్ మాగంటి వచ్చారు. శివాత్మిక కూడా ఈ సినిమాలో చేరింది. ఇప్పటికే ఈ సినిమా థాయిలాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది.
Also See : Ramya Pasupuleti : బికినీలో తెలుగు హీరోయిన్.. ఫిలిప్పీన్స్ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ..
నేడు ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజయి 8 ఏళ్ళు అవుతుండటంతో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ‘ఈNఈ రిపీట్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈNఈ రిపీట్ సినిమా నవంబర్ 19న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఈ డేట్ ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇందులో నలుగురు హీరోలు విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఓ కార్ లో ముస్తఫా.. సాంగ్ పెట్టుకొని వెళ్తున్నట్టు చూపించారు. ఈ సారి గోవా నుంచి థాయిలాండ్ కి వెళ్లే ట్రిప్ తో కథ ఉంటుందని తెలుస్తుంది.
The gang is back to celebrate where it all began ❤️
Celebrating the anniversary of #EeNagaranikiEmaindi with a release date announcement of ENE Repeat💥💥#ENERepeat in cinemas from NOVEMBER 19th, 2026 ✌🏻#8YearsOfENE #ENERepeatOnNov19th#TharunBhascker @VishwakSenActor… pic.twitter.com/Lkwz2VyWho
— S Originals (@SOriginals1) June 29, 2026
