×
Ad

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బ

సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది హీరోయిన్ ఈషా రెబ్బ(Eesha Rebba).

Eesha Rebba filed a complaint for offensive comments on her.

  • పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బ
  • తనపై వల్గర్ కామెంట్స్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలంటూ సూచన

Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. ఇటీవల ఈషా రెబ్బ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్ మరీ అసభ్యకరంగా ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది . ఈమేరకు ఆ వ్యక్తి ఐడీ, ఫోటో, అతను చేసిన కామెంట్‌ను పోలీసులకు చూపించింది. ఈషా రెబ్బ(Eesha Rebba) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బంజారాహిల్స్‌ పోలీసులు. ఓ వ్యక్తి ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఇలా కామెంట్స్‌ పెట్టినట్లు వారు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Shankar: గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ మూవీ.. పీరియాడికల్ డ్రామాతో భారీగా.. హీరోలు కూడా ఫిక్స్!