ENE Repeat : ‘ఈ నగరానికి ఏమైంది 2’లో రౌడీ హీరో గెస్ట్ అప్పీరెన్స్.. స్టార్ డైరెక్టర్ కూడా..?
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (ENE Repeat)
- Saketh U
- Published on- November 5, 2026 / 02:12 PM IST
ENE Repeat
ENE Repeat : 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించి ఈ సినిమాకు పార్ట్ 2 ENE రిపీట్ అనే టైటిల్ తో ఇప్పుడు రాబోతుంది. ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సినిమా నవంబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు.
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ ట్రైలర్ విజయ్ దేవరకొండ వాయిస్ తోనే ఓపెన్ అయింది. ఈ నగరానికి ఏమైంది సినిమా క్లైమాక్స్ లో విశ్వక్ డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు సీన్ చూపిస్తారు. ఈ సినిమా అక్కడనుంచే మొదలవుతుందని అలా సినిమా ఓపెనింగ్ లోనే విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ట్రైలర్ లో కూడా విజయ్ దేవరకొండ వాయిస్ ఉండటంతో ఇది ఫిక్స్ అనుకుంటున్నారు అంతా.
Also Read : Ramayanam : రామాయణం పార్ట్ 2 వాయిదా.. పార్ట్ 3 కూడా అనౌన్స్..
అలాగే ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా గెస్ట్ పాత్రలో ఒకేసారి కనిపిస్తారట. ఈ సినిమా కథ అంతా సినిమా చుట్టే తిరుగుతుంది. విశ్వక్ సినిమా తీసే దర్శకుడిగా అభినవ్ గోమఠం నటుడిగా, శివాత్మిక హీరోయిన్ పాత్రల్లో.. వీళ్లంతా కలిసి సినిమా తీసే కథాంశంతో ఈ సినిమా ఉండనుంది. ఇందులో భాగంగా అనిల్ రావిపూడి తన రియల్ పాత్రలోనే డైరెక్టర్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ రెండు గెస్ట్ అప్పీరెన్స్ లు ఉంటే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 కి మరింత హైప్ వచ్చినట్టే..
