Allu Arjun : అల్లు అర్జున్ పాటకి హాలీవుడ్ పాప్ సింగర్ డాన్స్.. వీడియో వైరల్

అల్లు అర్జున్ పాటకి హాలీవుడ్ పాప్ సింగర్ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాని వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

English Pop Singer Ed Sheeran dance to Allu Arjun song video gone viral

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ రెండు సినిమాల్లోని సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో రీచ్ ని సంపాదించుకున్నాయి. ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ని సంపాదించుకుంది. ఈ పాట వరల్డ్ వైడ్ గా ఇంతటి ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆస్ట్రేలియన్ క్రికెటర్ ‘డేవిడ్ వార్నర్’. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ ని వార్నర్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు.

ఇంటర్నేషనల్ మ్యాచ్స్ మధ్యలో పిచ్ పైనే ఈ స్టెప్ ని వేసి వార్నర్ ఆకట్టుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా వార్నర్ కనిపిస్తే చాలామందికి ఇదే స్టెప్ ముందుగా గుర్తుకు వస్తుంది. అందుకనే ఆ సినిమా రిలీజయ్యి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంకా ఆ పాట, ఆ స్టెప్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. తాజాగా ఓ హాలీవుడ్ పాప్ సింగర్ ఈ పాటకి స్టెప్ వేసి ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఐదు రోజులే షూటింగ్ చేశాం.. ఆ సినిమాని.. హరీష్ శంకర్ కామెంట్స్..

బుట్టబొమ్మ సాంగ్ ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్ తో కలిసి హాలీవుడ్ సింగర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran) డాన్స్ వేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోతో మరోసారి బుట్టబొమ్మ సాంగ్ టైం లైన్ లోకి వచ్చింది. కాగా ఈ పాట తరువాత వచ్చిన ‘శ్రీవల్లి’ సాంగ్ కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ పాటలో చెప్పు వదిలేసి స్టెప్ అందికీ భలే క్రేజీ అనిపించింది.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు పాటలకి డాన్స్ కోరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్. రెండు పాటలోని స్టెప్స్ చాలా సింపుల్ అండ్ గ్రేస్ ఉండడంతో ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. ఒకప్పుడు ప్రభుదేవా తన సింపుల్ స్టెప్స్ తోనే ఎలా ఓ మ్యాజిక్ చేసేవారో.. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అదే మ్యాజిక్ ని చూపిస్తున్నారు. జానీ అండ్ ప్రభుదేవా ఇద్దరు కలిసి కోరియోగ్రఫీ చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు