Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఐదు రోజులే షూటింగ్ చేశాం.. ఆ సినిమాని.. హరీష్ శంకర్ కామెంట్స్..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఐదు రోజులే షూటింగ్ చేశాం. హరీష్ శంకర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Harish Shankar interesting comments about Pawan Kalyan Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : ‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మరోసారి కలిసి పని చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అట్టహాసంగా మొదలైన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల షూటింగ్ తోనే సరిపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ తో బిజీ అవ్వడంతో.. హరీష్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టేసి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా స్టార్ట్ చేసారు.
‘ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ అదిరిపోయే గ్లింప్స్ తో పవన్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ వైబ్స్ ని ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాని నిజంగానే పక్కన పెట్టేశారా అనే సందేహం ఫ్యాన్స్ నెలకుంది. అయితే మూవీని పక్కన పెట్టలేదని, బ్రేక్ మాత్రమే ఇచ్చారని.. హరీష్ శంకర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ చూస్తుంటే తెలుస్తుంది. వైవా హర్షతో ఓ ఇంటర్వ్యూ చేసిన హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Also read : Kumari Aunty : మార్కెట్‌లో కుమారి ఆంటీ క్రేజ్ చూస్తుంటే.. నెక్స్ట్ బిగ్‌బాస్‌నా..!
“నేను షూట్ చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ ఐదు రోజులు ఫుటేజ్‌నే టీజర్ గా కట్ చేశాము. 12ఏళ్ళ క్రితం గబ్బర్ సింగ్ సెట్స్ ఏ వైబ్ కనిపించేదో.. ఇప్పుడు ఉస్తాద్ మూవీ సెట్స్ లో కూడా అదే వైబ్ మాకు కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో నేను సినిమాతోనే చూపిస్తాను” అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.
#UstaadBhagatSingh same on gabbar singh @PawanKalyanpic.twitter.com/2V9ue3Juhd
— Legend PawanKalyan FC™ (@Legend_PSPK) March 12, 2024
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మరో హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇక గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ మ్యూజిక్ ఏ రేంజ్ హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమా ఆడియో పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.