Kumari Aunty : మార్కెట్‌లో కుమారి ఆంటీ క్రేజ్ చూస్తుంటే.. నెక్స్ట్ బిగ్‌బాస్‌నా..!

మార్కెట్‌లో కుమారి ఆంటీ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నెక్స్ట్ బిగ్‌బాస్‌నా..

Kumari Aunty : మార్కెట్‌లో కుమారి ఆంటీ క్రేజ్ చూస్తుంటే.. నెక్స్ట్ బిగ్‌బాస్‌నా..!

Hyderabad Food stall vendor Kumari Aunty craze in telugu states

Updated On : March 13, 2024 / 2:06 PM IST

Kumari Aunty : కుమారి ఆంటీ, కుమారి ఆంటీ.. ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి టీవీ షోల వరకు గట్టిగా వినిపిస్తున్న పేరు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చి, ఒక చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్న ఈ మహిళ.. ఒక చిన్న వీడియోతో సోషల్ మీడియా స్టార్ట్ అయ్యిపోయారు. ఆ తరువాత టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి స్టేట్ సీఎం వరకు మాట్లాడుకునే రేంజ్ కి ఎదిగిపోయారు.

ఇంకేముందు ఒకరి క్రేజ్ ని గట్టిగా వాడుకునే మన తెలుగువారు, తెలుగు ఛానల్స్.. కుమారి ఆంటీని తమ ప్రమోషన్స్ కోసం బాగా ఉపయోగించేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు చలానా వెయ్యాలన్నా కుమారి ఆంటీ డైలాగ్ కావాలి, ఒక బిజినెస్ ప్రమోషన్ జరగాలన్నా కుమారి ఆంటీ అపిరెన్స్ కావాలి, ఒక టీవీ షో టిఆర్పి పెరగాలన్నా కుమారి ఆంటీ ఎంట్రీ కావాలి. దీంతో ప్రతిరోజు ఏదో విధంగా కుమారి ఆంటీ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

Also read : Meera Chopra : ఏడడుగులు వేసేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. మీరా చోప్రా పెళ్లి ఫోటోలు వైరల్..

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ షోల్లో, సీరియల్స్ లో కనిపిస్తున్న కుమారి ఆంటీ త్వరలో.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ కి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే బిగ్‌బాస్ ఉత్సవ్ లో గెస్ట్ గా పాల్గొని సందడి చేసిన కుమారి ఆంటీని త్వరలో కంటెస్టెంట్ గా కూడా తీసుకు వచ్చేస్తారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా స్టార్స్ ని కంటెస్టెంట్స్ గా తీసుకు వచ్చిన బిగ్‌బాస్ నిర్వాహుకులు నెక్స్ట్ సీజన్ కి కుమారి ఆంటీని కూడా తీసుకు వస్తారేమో చూడాలి.

కాగా కుమారి ఆంటీ రీసెంట్ గా జీ తెలుగు సీరియల్ లో స్పెషల్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు. ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి ఎపిసోడ్ కి టిఆర్పి పెంచే బాధ్యతని తీసుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సీరియల్స్ అండ్ షోల్లో కనిపడి కుమారి ఆంటీ సందడి చేస్తారో చూడాలి. అలాగే ఈ ఫేమ్ ని కుమారి ఆంటీ ఎలా మెయిన్‌టైన్ చేస్తారు అనేది కూడా చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Trolls ka Baap2.0 ?25k (@trolls_ka_baap_2.0)

 

View this post on Instagram

 

A post shared by ?? ?????? (@sr_.status)

 

View this post on Instagram

 

A post shared by @bigboss_updates3.0