Meera Chopra : ఏడడుగులు వేసేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. మీరా చోప్రా పెళ్లి ఫోటోలు వైరల్..
ఏడడుగులు వేసేసిన పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా హీరోయిన్. జైపూర్ లో జరిగిన ఈ పెళ్లి ఫోటోలు..

Actress Meera Chopra marriage photos gone viral
Meera Chopra : ప్రియాంక చోప్రా కజిన్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా హీరోయిన్ మీరాచోప్రా కూడా ఏడడుగులు వేసేసారు. తమిళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మీరా చోప్రా.. సెకండ్ మూవీ పవన్ కళ్యాణ్ తో చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ‘బంగారం’ సినిమాలో నటించిన మీరా చోప్రా.. ఆ తరువాత వాన, మారో, గ్రీకువీరుడు సినిమాల్లో నటించారు.
తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించిన ఈ హీరోయిన్.. ముంబైకి చెందిన రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తతో గత మూడేళ్ళుగా ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ.. పెళ్లి బంధాన్ని స్టార్ట్ చేసారు. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ రిసార్ట్స్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మార్చి 11, 12 తేదీలలో రెండు రోజుల సంబరంగా వివాహం జరిగింది.
Also read : Devi Sri Prasad : 25 ఇయర్స్ ఆఫ్ దేవిశ్రీ.. ఇన్నాళ్ల ఓ చిన్న కల.. గురువుతో శిష్యుడి స్పెషల్ డే..
కేవలం కుటుంబసభ్యులు, పలువురు బంధుమిత్రుల సమక్షంలోనే మీరా చోప్రా ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ తో ఏడడుగులు వేశారు. ఇక ఈ పెళ్లి సందడి పూర్తి అవ్వడంతో.. మీరా అండ్ రక్షిత్ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. గొడవలు, కన్నీళ్లు, నవ్వులు, సంతోషం, జీవితాంతం సరిపోయే జ్ఞాపకాలు అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేసుకొచ్చారు.
View this post on Instagram