Devi Sri Prasad : 25 ఇయర్స్ ఆఫ్ దేవిశ్రీ.. ఇన్నాళ్ల ఓ చిన్న కల.. గురువుతో శిష్యుడి స్పెషల్ డే..
ఇన్నాళ్ల దేవిశ్రీప్రసాద్ కన్న ఓ చిన్న కల 25 ఇయర్స్ స్పెషల్ డే నాడు నిజమైంది. గురువుతో శిష్యుడి సంగీత ప్రయాణం..

Devi Sri Prasad celebrates his 25 years journey with Ilaiyaraaja
Devi Sri Prasad : టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆడియన్స్ కి పరిచయమై నిన్నటితో (మార్చి 12) 25 ఏళ్ళు అవుతుంది. 1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో దేవిశ్రీ తన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు. మొదటి సినిమాతోనే హిట్టుని అందుకున్న దేవిశ్రీ.. ఆ తరువాత ఆనందం, కలుసుకోవాలని, సొంతం వంటి మ్యూజికల్ మూవీస్ తో మ్యూజికల్ లవర్స్ ని మెస్మరైజ్ చేసారు.
ఆ తరువాత ఖడ్గం, మన్మథుడు, వర్షం వంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డారు. ఇక అలా మొదలైన దేవిశ్రీ ప్రయాణం.. తమిళ, హిందీ భాషల్లో కూడా కొనసాగుతూ దేవిశ్రీని రాక్ స్టార్ ని చేసింది. దాదాపు తెలుగు, తమిళ్, హిందీ భాషలోని టాప్ హీరోల అందరికి దేవిశ్రీ సంగీతం అందించారు. ఇక తన రాకింగ్ మ్యూజిక్‌తో, ఎనర్జీతో హీరో స్థాయి ఇమేజ్ ని ఆడియన్స్ లో అందుకున్నారు.
పుష్ప సినిమాకి ఇచ్చిన సంగీతంతో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు, జనరల్ ఆడియన్స్ నుంచి పబ్లిక్ ఆఫీసర్ వరకు పుష్ప మ్యూజిక్ కి చిందేసేలా చేసారు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తూ.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ కొనసాగుతున్నారు. కంపోజర్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా తమని ఎంటర్టైన్ చేస్తున్న దేవిశ్రీకి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also read : Lal Salaam : 21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది.. ‘లాల్ సలామ్’ అందుకే ప్లాప్.. ఐశ్వర్య రజినీకాంత్
ఇక ఇది ఇలా ఉంటే, దేవిశ్రీ ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్ గా చేసుకున్నట్లు తెలుస్తుంది. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజాని గురువుగా భావించే దేవిశ్రీ.. ఆయన స్ఫూర్తితోనే ఇంత గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగాను అని చెప్పుకొస్తుంటారు. అందుకనే తన స్టూడియోలో ఇళయరాజా భారీ ఫోటోని పెట్టుకొని రోజు ఆరాధిస్తుంటారు. జీవితంలో ఎప్పుడైనా ఇళయరాజా తన స్టూడియోకి వస్తే.. ఆ పిక్చర్ ముందు ఫోటో దిగాలని కలగంటూ ఉన్నారు.
ఆ కల ఇన్నాళ్ల తరువాత నిజమైంది. రీసెంట్ గా దేవిశ్రీ స్టూడియోని ఇళయరాజా సందర్శించారు. దీంతో దేవిశ్రీ తన ఇన్నాళ్ల ఆ చిన్న కలని ఒక ఫోటోతో తిరిచేసుకున్నారు. ఇక ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఇళయరాజాతో ఉన్న ఫోటోని షేర్ చేసారు దేవిశ్రీ. అలాగే తనకి అవకాశాలు ఇస్తూ ఇంతటి వాడిని చేసిన నిర్మాతలు, దర్శకులకు, తన సంగీతాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
View this post on Instagram