ET10 : త్రిషకు చిరు అండ.. రెండు దేశాల్లో ఆ సినిమా బ్యాన్.. చరణ్, అర్జున్ స్పెషల్ పోస్టులు..
త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ నేడు స్పెషల్ పోస్టులతో..
- gum 95921
- Updated on- November 21, 2023 / 07:03 PM IST
ET 20: Latest Entertainment News Today on 21 November at 6:30PM
ఆదికేశవ ట్రైలర్ జోరు..
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన ఒక్కరోజులోనే 4.4 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు వారి జాయ్..
నేడు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా.. అర్హకు బన్నీ స్పెషల్ విషేష్ చెప్పారు. అర్హతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హ్యాపీ బర్త్ డే మై జాయ్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాకుంతలం సినిమా ద్వారా అర్హ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆదికేశవ టీమ్‌కు చరణ్ స్పెషల్ విషెష్..
ఆదికేశవ టీమ్‌కు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ విషెష్ తెలిపారు. ఆదికేశవ ట్రైలర్ ఆకట్టుకుంటోందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ సినిమా ట్రైలర్ బాగుందని.. తనకు ఎంతో నచ్చిందని చరణ్ అన్నారు. వైష్ణవ్ తేజ్‌తో పాటు సినిమా మెుత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
హాయ్ నాన్న ట్రైలర్..
న్యాచురల్ స్టార్ నాని, అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ పోస్టర్‌ను నాని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వైజాగ్‌లో భారతీయుడు..
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘భారతీయుడు 2’. వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
‘కెప్టెన్ మిల్లర్’ కిల్లర్ కిల్లర్ సాంగ్..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి కిల్లర్ కిల్లర్ సాంగ్ రేపు విడుదల చేయనున్నారు.
‘రాంగ్ యూసేజ్’ అంటున్న వెంకీ మామ..
వెంకటేశ్, శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘రాంగ్ యూసేజ్’ను రిలీజ్ చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రెండు దేశాలు మమ్ముట్టి- జ్యోతిక సినిమా నిషేధం..
మమ్ముట్టి- జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాథల్-ది కోర్.ఈ మలయాళ చిత్రంపై రెండు దేశాలు నిషేధం విధించాయి. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో.. ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
త్రిషకు చిరు అండ..
త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు. ఒక నటిని మాత్రమే కాదు.. ఏ స్త్రీని ఇలా అనకూడదు. చాలా అసహ్యంగా అలిఖాన్ మాటలు ఉన్నాయని చిరంజీవి అన్నారు. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటానని చిరు తెలిపారు.
‘డంకీ’ డ్రాప్ 2 డేట్ ఫిక్స్..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం డంకీ. రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. షారుఖ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డంకీ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. రేపు మరో సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
