F3 Movie: షూటింగ్ జర్నీ కంప్లీట్.. ఇక నవ్వుల జర్నీ స్టార్ట్!
2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ‘ఎఫ్-2’. సంక్రాంతి హాలిడేస్ కి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకున్నారు.
- Naresh Mannam
- Published On : January 29, 2022 / 08:22 PM IST
F3 Movie
F3 Movie: 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ‘ఎఫ్-2’. సంక్రాంతి హాలిడేస్ కి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకున్నారు. ఒక మాములు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఎంత భారీ విజయం సాధించిందో అర్ధమవుతుంది. ఈ విజయం ఇచ్చిన ఊపులో మేకర్స్ ‘ఎఫ్3’ కూడా తీసేద్దామని ఫిక్స్ అయ్యారు.
Naga Chaitanya: తమిళ దర్శకుడితో చైతూ ద్విభాషా చిత్రం?
అనుకున్నట్లుగానే షూటింగ్ మొదలు పెట్టారు కానీ.. 2021 సంక్రాంతికే రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వాచ్చింది. ఒకపక్క షూటింగ్ కు అంతరాయంతో పాటు రిలీజ్ డేట్ ప్రకటించడం.. అప్పటికి పరిస్థితులు కారణంగా వాయిదా పడడం జరుగుతూ వస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాని 2022 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. కరోనా పరిస్థితులు ఉన్నా.. ఎట్టకేలకు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.
New Movies Release: ఫిబ్రవరి ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవుతున్న థియేటర్లు!
ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తైనట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ వీడియోను పంచుకుంటూ ‘మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది.. వస్తే, కొద్దిగా ముందుగా.. వెళ్ళినా కొద్దిగా వెనకగా.. థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా’ అని తెలిపింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానున్నట్టు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. మరి ఆ రోజే వస్తుందో.. లేక కొద్దిగా ముందు వెనకకి వస్తుందో చూడాలి.
మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.
మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉వస్తే, కొద్దిగా ముందుగా.
వెళ్ళినా కొద్దిగా వెనకగా!😊థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/CHjtB5Ry5S
— Sri Venkateswara Creations (@SVC_official) January 29, 2022
