Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్ తో ఫహాద్ ఫాజిల్ సినిమా ట్రైలర్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’..
మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Dont Trouble The Trouble)
- Saketh U
- Published on- September 22, 2026 / 08:52 PM IST
Dont Trouble The Trouble
Dont Trouble The Trouble : మలయాళ నటుడు, పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మాణంలో శశాంక్ యేలేటి దర్శకత్వంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ కి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం అందర్నీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ ఒక మెజీషియన్ గా కనిపించబోతున్నాడు. తన దగ్గరికి ఒక చిన్న పాప రావడం, మ్యాజిక్స్ చేయడం, తను ఆత్మ అని తెలియడం, తన వాళ్ళ ఫహాద్ ఫాజిల్ పాత్ర ఇబ్బందుల్లో పడటంతో ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య బాబు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డైలాగ్ ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని సినిమా టైటిల్ గా పెట్టడం, బాలయ్య వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also See : Anchor Manjusha : షార్ట్ నిక్కర్‌లో క్యూట్ కళ్లజోడుతో యాంకర్ మంజూష.. ఫొటోలు..
మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..
