విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్నఫలక్‌నామా దాస్-టీజర్ రిలీజ్..
వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఫిలిమ్.. ఫలక్‌నామా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పక్కా హైదరాబాదీ స్టైల్‌లో రూపొందిన ఫలక్‌నామా దాస్ టీజర్ రిలీజ్ అయింది.. ఫలక్‌నామాల బారాబజే లేస్నామా, ఏక్ బజే తిన్నమా, రెండింటికి కల్సినమా.. అంటూ, విశ్వక్ సేన్ వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్, హైదరాబాద్ గల్లీ గ్యాంగ్‌లు, దందాలు ప్రధాన అంశాలుగా రూపొందింది.. ఫలక్‌నామా దాస్ టీజర్‌లో, కంటెంట్ వైలెంట్ అయితే, డైలాగులు మాత్రం బూతులే.. రెగ్యులర్‌గా యూజ్ చేసే బూతుల్నే డైలాగులుగా పలికాడు హీరో విశ్వక్..
టీజర్ ద్వారా, సినిమాలో రొమాన్స్, లిప్ లాక్‌లు ఉండబోతున్నాయనే హింట్ ఇచ్చారు.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ క్యారెక్టర్‌లో నటించగా, ఉత్తేజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం : వివేక్ సాగర్, కెమెరా : విద్యా సాగర్, ఎడిటింగ్ : రవితేజ, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ.
వాచ్ టీజర్…