Sri Ramana : ప్రముఖ రచయిత కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..
టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు.
- Saketh U
- Published On : July 19, 2023 / 09:14 AM IST
Famous Tollywood Writer Sri Ramana Passes away
Sri Ramana : ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి విషాదం నింపారు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు. 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు శ్రీ రమణ. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
శ్రీరమణ జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం నవ్య వార్తాపత్రికకు ఎడిటర్ గా పనిచేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథా రచయితగా, డైలార్ రైటర్ గా పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణకు ఎంతగానో పేరు తెచ్చింది.
