Samajavaragamana : అమెరికాలో ఫస్ టైం రికార్డ్ సెట్ చేసిన శ్రీవిష్ణు.. సామజవరగమన జోరు మాములుగా లేదుగా..

శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వచ్చిన సినిమాగా సామజవరగమన నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో చిత్రయూనిట్ అంతా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. తాజాగా సామజవరగమన మరో రికార్డ్ సెట్ చేసింది.

Samajavaragamana : అమెరికాలో ఫస్ టైం రికార్డ్ సెట్ చేసిన శ్రీవిష్ణు.. సామజవరగమన జోరు మాములుగా లేదుగా..

Sree Vishnu Reba Monica Samajavaragamana Movie sets record in America with collections

Updated On : July 19, 2023 / 9:01 AM IST

Samajavaragamana Collections :  శ్రీ విష్ణు(sree Vishnu), రెబా మోనికా(Reba Monica) జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సామజవరగమన. జూన్ 29న రిలీజయిన ఈ సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇటీవల కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఆ తరహాలోనే సామజవరగమన సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఫుల్ లెంగ్త్ కామెడీతో అన్ని రకాల ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇప్పటికే సామజవరగమన సినిమా 47 కోట్లు వసూలు చేసి 50 కోట్లకు చేరువలో ఉంది.

శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వచ్చిన సినిమాగా సామజవరగమన నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో చిత్రయూనిట్ అంతా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. తాజాగా సామజవరగమన మరో రికార్డ్ సెట్ చేసింది. అమెరికాలో మన తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ మన తెలుగు సినిమాలన్నీ రిలీజయి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలో 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తేనే రికార్డ్ అని చెప్పుకుంటారు. ఒక చిన్న సినిమా, మీడియం హీరో అమెరికాలో 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడమంటే కష్టమే.

Thalaivar 171 : ‘లియో’ తర్వాత లోకేశ్ రజినీకాంత్ తోనే? తలైవర్ 171వ సినిమా కొత్త సంవత్సరంలో మొదలు..

కానీ సామజవరగమన సినిమాతో శ్రీవిష్ణు కొత్త రికార్డ్ సెట్ చేశాడు. అమెరికాలో సామజవరగమన సినిమా ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 7 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శ్రీ విష్ణు కెరీర్ లో అమెరికాలో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన మొదటి సినిమాగా నిలిచిపోయింది సామజవరగమన.