Chandrasekhar : ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయి కిర‌ణ్ అరెస్ట్.. కార‌ణం తెలిస్తే షాక్..!

నార్సింగి పోలీసులు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయికిర‌ణ్‌ను అరెస్ట్ చేశారు.

Famous Youtuber Chandrasekhar Sai Kiran Arrest

Chandrasekhar Sai Kiran : నార్సింగి పోలీసులు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయికిర‌ణ్‌ను అరెస్ట్ చేశారు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుక‌ల‌కు త‌న‌ను ఆహ్వానించి లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఏప్రిల్ 25న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది. అంతేకాకుండా త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసిన‌ట్లు పేర్కొంది.

Klin Kaara : ముంబైలో కూతురితో చరణ్, ఉపాసన.. వీడియో వైరల్..

ఈ క్ర‌మంలో యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు అతడి త‌ల్లిదండ్రులు, మ‌రో ఇద్ద‌రి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుడు చంద్ర‌శేఖ‌ర్ ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. కాగా.. ప‌క్కింటి కుర్రాడు పేరుతో కొంత‌కాలం క్రితం చంద్ర‌శేఖ‌ర్ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. స‌ర‌దాగా, సందేశాత్మ‌క వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌డి ఛానెల్‌కు 13 ల‌క్ష‌ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబర్‌గా వ‌చ్చిన గుర్తింపుతో సాయికిరణ్ పలు సినిమాలలో నటించాడు.