Klin Kaara : ముంబైలో కూతురితో చరణ్, ఉపాసన.. వీడియో వైరల్..

చరణ్ దంపతులు క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి అన్ని పండగలు తమ పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా చరణ్ ఉపాసన తమ కూతురు క్లిన్ కారాతో ముంబైలో కనపడ్డారు.

Klin Kaara : ముంబైలో కూతురితో చరణ్, ఉపాసన.. వీడియో వైరల్..

Ram Charan Upasana Appeared in Mumbai with their Daughter Klin Kaara

Updated On : December 15, 2023 / 5:36 PM IST

Klin Kaara : ఇటీవల కొన్ని నెలల క్రితం చరణ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాపకు ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టారు. క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి వైరల్ అయింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ గా అభిమానులు ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు కూడా పాప ఫోటో కనిపించకుండా చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అభిమానులు క్లిన్ కారా ఫేస్ ని ఎప్పుడు చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.

ఇక చరణ్ దంపతులు క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి అన్ని పండగలు తమ పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా చరణ్ ఉపాసన తమ కూతురు క్లిన్ కారాతో ముంబైలో కనపడ్డారు. తాజాగా ఈ జంట ముంబై(Mumbai) వెళ్లగా ఇంట్లోకి వెళ్తుండగా మీడియా వీడియోలు తీశారు. ఉపాసన, క్లిన్ కారా కారులో రాగా చరణ్ ఇంట్లోంచి బయటకి వచ్చి పాపని తీసుకొని లోపలి వెళ్ళాడు.

Also Read : Roshan – Akash : యాంకర్ సుమ కొడుకు వర్సెస్ సింగర్ సునీత కొడుకు.. మొదటి సినిమాలతోనే పోటీ..

ఇప్పుడు కూడా పాప ఫోటో చూపించకుండా తీసుకెళ్లారు చరణ్, ఉపాసన. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు.