Amitabh Kalki Glimpse : ఇది గ్రాఫిక్స్ అంటే.. అమితాబ్ పర్ఫెక్ట్ యంగ్ లుక్.. నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్న నెటిజన్లు..
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
- Saketh U
- Published On : April 22, 2024 / 07:36 AM IST
Fans and Netizens Praised Nag Ashwin for Amitabh Bachchan Ashwatthama Young Looks in Kalki 2898AD Movie
Amitabh Kalki Glimpse : ప్రభాస్(Prabhas) కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల వల్ల ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. తాజాగా నిన్న కల్కి సినిమా నుంచి అమితాబ్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ ‘అశ్వత్థామ’గా కనపడబోతున్నట్టు తెలిపారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు అశ్వత్థామ ఈ గ్లింప్స్ లో తెలిపారు.
దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే టెక్నికల్ గా కూడా కల్కి హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ తో తెలిసిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన అమితాబ్ గ్లింప్స్ లో షాట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓ షాట్ లో అమితాబ్ యంగ్ లుక్ లో కనిపిస్తారు. ఆ లుక్ లో అచ్చం అమితాబ్ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు.
Also Read : Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి అమితాబ్ గ్లింప్స్ లో అమితాబ్ ను డీ-ఏజింగ్ టెక్నాలజీతో పర్ఫెక్ట్ యంగ్ గా చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు కల్కి టీమ్. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ను అమితాబ్ ఫ్యాన్స్ కూడా పొగిడేస్తున్నారు. ఇదిరా గ్రాఫిక్స్ అంటూ, ఎంత లేట్ అయినా పర్లేదు సినిమా ఇలా ఫుల్ క్వాలిటీగా ఉండాలని నాగ్ అశ్విన్ ని పొగిడేస్తూనే మరోసారి ఆచార్య, ఆదిపురుష్ సినిమాలని విమర్శిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=t_E5zjFj6Ew
