Prabhas : సింహం.. తిమింగలం.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్స్ అదుర్స్..
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ఇంటి బయట ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
- sekhar
- Published on- October 21, 2021 / 02:06 PM IST
Prabhas
Prabhas: డార్లింగ్, రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.. అభిమానులకు పండుగ రోజు.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా తనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ సాలిడ్ బర్త్‌డే ట్రీట్స్ రెడీ చేస్తున్నారు. ‘రాధే శ్యామ్’ టీజర్ నుండి ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-K’, ‘స్పిరిట్’ ఇలా వరుస అప్డేట్స్ రానున్నాయి.
Prabhas : బర్త్‌డే సర్ప్రైజెస్ వచ్చేస్తున్నాయ్ డార్లింగ్స్..
ఇక వరల్డ్ వైడ్‌గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికే బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు. రెండు తెలుగు రాష్టాల్లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. భారీ బ్యానర్స్, ఫ్లెక్సీలు, కేక్స్, క్రాకర్స్, పూలదండలతో హంగామా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
SPIRIT : పవర్ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..
ప్రభాస్ స్వస్థలం భీమవరంలో ఈసారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటబోతున్నాయట. ఇక జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ నివాసం వద్ద హైదరాబాద్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలకు సంబంధించిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘సముద్రంలో తిమింగలాన్ని ఆపడం ఎంత కష్టమో.. ఇండస్ట్రీలో ఈ సింహాన్ని ఆపటం అంతే కష్టం’ ప్రభాస్ – కృష్ణంరాజు ఫొటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
