Ram Charan : చరణ్-ఉపాసనల కొత్త పిక్ వైరల్.. క్లీంకారతో కామెడీ పుట్టిస్తున్న అభిమానులు..
రామ్ చరణ్-ఉపాసనల కొత్త పిక్‌ని క్లీంకారతో కామెడీ చేయిస్తున్న అభిమానులు.
- gum 95921
- Updated on- February 9, 2024 / 01:46 PM IST
fans generating comedy on Ram Charan Upasana recent photo with klin kaara
Ram Charan : రామ్ చరణ్ నుంచి ఒక సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి కొత్త పోస్టర్స్ కూడా రాకపోవడంతో.. చరణ్ కి సంబంధించిన ఏ ఫోటో నెట్టింట లీకైనా అభిమానులు దానిని వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఉపాసనతో రామ్ చరణ్ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో ఎక్కడిదో తెలియదు గానీ, ఆ పిక్‌లో.. చరణ్-ఉపాసన డోర్ బయట వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఇది చూసిన చరణ్ అభిమానులు.. మెగా వారసులు క్లీంకారని తీసుకొచ్చి కామెడీ జనరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కామెడీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కామెడీ ఏంటంటే.. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ మూవీ స్టార్టింగ్ లో హీరో చిన్నప్పుడు స్కూల్ ‘రవీంద్రనాథ్ ఠాగూర్’ గురించి రాయమంటే.. మెగాస్టార్ ‘ఠాగూర్’ గురించి రాస్తాడు.
Also read : Eagle : టాలీవుడ్లో సీక్వెల్స్ లిస్టు పెరుగుతూ పోతుంది.. రవితేజ ‘ఈగల్’ కూడా..
ఇప్పుడు ఇదే సీన్ లో క్లీంకారని పెట్టి మెగా ఫ్యాన్స్ కామెడీ చేస్తున్నారు. స్కూల్ లో ఠాగూర్ గురించి రాయమంటే.. క్లీంకార తన తాత గురించి రాసిందట. ఇక అది చూసిన స్కూల్ ప్రిన్సిపాల్.. పేరెంట్స్ వస్తే గానీ క్లీంకారని క్లాస్ లోకి అటెండ్ చేయను అన్నారట. దీంతో చేసేది లేక క్లీంకార స్కూల్ కి చరణ్, ఉపాసనని తీసుకు వెళ్లగా.. వాళ్ళు ప్రిన్సిపాల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్న ఫోటోనే అదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ట్వీట్ చూసిన కొందరు అభిమానులు.. అంటే నెక్స్ట్ స్టాలిన్, సైరా నరసింహారెడ్డి గురించి రాయమన్నపుడు కూడా ఇదే జరుగుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోలో చరణ్.. సైడ్ లుక్ లోనే కనిపిస్తున్నారు. ఆ గెటప్ చూస్తుంటే.. గేమ్ ఛేంజర్ లుక్ లాగానే కనిపిస్తుంది. ఆ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శంకర్ ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
