Eagle : టాలీవుడ్‌లో సీక్వెల్స్ లిస్టు పెరుగుతూ పోతుంది.. రవితేజ ‘ఈగల్’ కూడా..

ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి, అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా సీక్వెల్ ని తీసుకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది.

Eagle : టాలీవుడ్‌లో సీక్వెల్స్ లిస్టు పెరుగుతూ పోతుంది.. రవితేజ ‘ఈగల్’ కూడా..

Tollywood movie sequels list details and eagle also announce second part

Eagle : ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో సీక్వెల్స్ ఎక్కువ అయ్యిపోతున్నాయి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి, అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా సీక్వెల్ ని తీసుకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. ఆడియన్స్ లో ఆ సీక్వెల్ పై ఉన్న క్రేజ్ ని పరిశీలించి.. అప్పుడు సీక్వెల్ ని తెరపైకి తీసుకు వచ్చే ధైర్యం చేసేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. మొదటి సినిమా రిజల్ట్ తెలియకుండానే సీక్వెల్ ని అనౌన్స్ చేసేస్తున్నారు.

ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలు సీక్వెల్ కి కనెక్షన్ కి ఇచ్చేలా ఓపెన్ ఎండింగ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని చిత్రాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ని టాక్ ని సొంతం చేసుకొని, సీక్వెల్ కి లీడ్ ఇస్తూ క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే చాలా వరకు చిత్రాలు ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి.

Also read : Eagle Review : ‘ఈగల్’ మూవీ రివ్యూ.. స్టైలిష్ యాక్షన్‌తో మెసేజ్ ఇచ్చిన రవితేజ..

సీక్వెల్ కి లీడ్ ఇచ్చే పాయింట్ కోసం మొదటి బాగానే సరిగ్గా నేరేట్ చేయలేకపోతున్నారు. ట్రెండ్ తగ్గట్లు మేకింగ్ లో మార్పు చూపించడం సరైన అంశమే. కానీ, సీక్వెల్ ని దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్‌ని సరిగ్గా చూపించలేకపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ డజనుకు పైగా సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి రవితేజ ‘ఈగల్’ మూవీ కూడా వచ్చి చేరింది. ఈరోజు రిలీజైన ఈ చిత్రం ముగింపులో సీక్వెల్ ని అనౌన్స్ చేసేశారు.

కాగా రానున్న రోజుల్లో టాలీవుడ్ లో రాబోయే సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటే.. ఈగల్ తో కలుపుకొని మొత్తం 16 చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే సీక్వెల్స్ విషయానికి వస్తే.. పుష్ప, సలార్, దేవర, జై హనుమాన్, కార్తికేయ 3. రీజినల్ లెవెల్ లో రాబోయే సీక్వెల్స్ ఏంటంటే.. అఖండ, బింబిసారా, గూఢచారి, హిట్, విరూపాక్ష, గీతాంజలి, ఇస్మార్ట్ శంకర్, ప్రాజెక్ట్ Z, డీజే టిల్లు, శతమానంభవతి.