Femina George : అల్లు అర్జున్ ‘రాకా’లో మలయాళీ భామ.. తనెప్పుడో హింట్ ఇచ్చింది..

రాకా సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగానే ప్రకటించారు. (Femina George)

  • Updated on- June 1, 2026 / 03:49 PM IST

Femina George

Femina George : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ సినిమాగా రాకా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

రాకా సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే రాకా సినిమాలో ఆల్మోస్ట్ అయిదుగురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వచ్చాయి. ఇందులో మృణాల్, జాన్వీ, రష్మిక పలువురు బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా మలయాళీ హీరోయిన్ ఫెమినా జార్జ్ తాను అల్లు అర్జున్ రాకా సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

Also Read : మరి కాసేపట్లో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..

ఇటీవల ఓ మలయాళ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఫెమినా జార్జ్‌ తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. నేను అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్నాను. అసలు ఆ సినిమాలో నేను నటిస్తానని ఊహించలేదు. అది ఒక భారీ సినిమా. అల్లు అర్జున్ తో కలిసి నటిస్తానని అసలు ఊహించలేదు. హ్యాపీ సినిమా నేను చూసిన ఫస్ట్ అల్లు అర్జున్ సినిమా. రాకా సినిమాలో నా పాత్ర చిన్నదే. కానీ అంత పెద్ద సినిమాలో భాగమయినందుకు చాలా ఆనందంగా ఉంది. రాకా సినిమా టీమ్ నుంచే ఫోన్ వచ్చింది. వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపింది.

ఫెమినా జార్జ్ మలయాళ సూపర్ హిట్ సినిమా మిన్నల్ మురళిలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తీపోరి బెన్ని, శేషం మైక్ అనే మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ రాకా సినిమాలో కూడా భాగమైంది. అయితే ఫెమినా జార్జ్ అల్లు అర్జున్ రాకా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి టాప్ లో పెట్టుకుంది. అలా తను కూడా రాకాలో ఉన్నట్టు హింట్ ఇచ్చింది. అపుడు ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు తానే స్వయంగా రాకాలో నటిస్తున్నట్టు చెప్పడంతో ఫెమినా జార్జ్ వైరల్ గా మారింది.

Also See : Regena Cassandrra : గుర్రాన్ని దత్తత తీసుకున్న రెజీనా.. గుర్రంతో క్రేజీ ఫొటోలు..