Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం.. షూటింగ్ సామాగ్రి దగ్ధం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘స్పిరిట్(Spirit)’ చిత్ర సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

Fire Accident on the Sets of Prabhas Spirit movie

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘స్పిరిట్(Spirit)’ చిత్ర సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో టెంట్లు, షూటింగ్ సామగ్రి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో చిత్ర యూనిట్‌కు చెందిన ఒకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Priya Prakash: స్లీవ్‌లెస్ టీషర్ట్‌లో పరువాల విందు.. ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ ఫొటోషూట్.. ఫొటోలు

ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల షూటింగ్‌కు స్వల్ప ఆటంకం కలిగినప్పటికీ, త్వరలోనే పనులను చక్కదిద్ది మళ్లీ చిత్రీకరణ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.