‘రొమాంటిక్’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

ఆకాష్ పూరీ, కేతికా శర్మ నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.. అప్రమత్తమైన యూనిట్ సభ్యులు మంటలు ఆర్పారు..

  • Publish Date - October 15, 2019 / 07:57 AM IST

ఆకాష్ పూరీ, కేతికా శర్మ నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.. అప్రమత్తమైన యూనిట్ సభ్యులు మంటలు ఆర్పారు..

ఆకాష్ పూరీ, కేతికా శర్మ నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెట్‌లో ఏర్పాటు చేసిన తెరకు నిప్పంటుకుని, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు మంటలు ఆర్పారు. ఎంతో ఎత్తులో ఏర్పాటు చేసిన తెరలకు కూడా మంటలు వ్యాపించాయి.

అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇన్సిడెంట్ జరిగేప్పుడు తీసిన వీడియో విడుదల చేసింది మూవీ టీమ్. ఈ సినిమాకు పూరీ జగన్నాధ్.. స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

Read Also : మెగాభిమానులకు ప్రేమతో.. సాయి ధరమ్ తేజ్ ‘గొప్పమనసు’

శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు.