‘లక్ష్మీబాంబ్’ – అక్షయ్ అదరహో!

కాంచన రీమేక్ : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్న'లక్ష్మీబాంబ్' ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Publish Date - October 3, 2019 / 09:58 AM IST

కాంచన రీమేక్ : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్న’లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

ఫేమస్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంచన సిరీస్‌తో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముని, కాంచన, గంగ, కాంచన-3 (ముని4) సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు. కాంచన బాలీవుడ్‌లో ‘లక్ష్మీబాంబ్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్నారు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాంచన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హిజ్రా క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం.. శరత్ కుమార్ ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. ‘లక్ష్మీబాంబ్’ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ రోల్ చెయ్యనున్నారని వార్తలు వచ్చాయి.

Read Also : తెలుగులో ‘జెమిని మ్యాన్’ – అక్టోబర్ 11న విడుదల..

కట్ చేస్తే అక్షయ్ కుమారే హిజ్రా క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లుక్ రివీల్ చేశారు. చీరకట్టులో, మహిషాసురమర్దిని విగ్రహం ముందు నిలబడి ఉన్న అక్షయ్ లుక్ బాగుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌పి, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌ కలిసి నిర్మిస్తున్న లక్ష్మీబాంబ్ 2020 జూన్ 5న విడుదల కానుంది.