Bigg Boss 5 : మోర్ ఫన్.. మోర్ ఎంటర్టైన్మెంట్..
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌ని మరింత ఆసక్తిగా ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది..
- sekhar
- Published on- August 1, 2021 / 02:26 PM IST
Bigg Boss 5 Logo
Bigg Boss 5: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌ని మరింత ఆసక్తిగా ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది. వరుసగా నాలుగు సీజన్లతో టీవీ ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలో స్టార్ట్ కానుంది.
RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..
ఆదివారం బిగ్ బాస్ -5 తెలుగు టైటిల్ లోగో లాంచ్ చేశారు. ఈసారి హౌస్ గోల్డెన్ ఫారెస్ట్‌లా ఉండబోతోంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీతో పాటు గేమ్‌లోని డిఫరెంట్ వేరియేషన్స్‌ను తెలియజేసేలా డిజైన్ చేసిన లోగో ఫస్ట్‌లుక్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో లోగో తీర్చిదిద్దారు.
Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ 5 డేట్ ఫిక్స్.. మంగ్లీ డౌట్
బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే కంటెస్టెంట్స్, విన్నర్‌గా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఫన్, లవ్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్.. ఇలా ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈసారి బిగ్ బాస్ రెడీ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కి సంబంధించి హోస్ట్, కంటెస్టెంట్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
