క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం, అదితిరావు హైదరి రేర్ పిక్ షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సిగ్గుపడ్డారు. కథానాయిక అదితిరావు హైదరి ఆయనకు రోజా పువ్వు ఇస్తుండగా సిగ్గుతో మొగ్గలేశారు మణి.. వివరాళ్లోకి వెళ్తే.. ‘చెలియా’, ‘నవాబ్’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటిస్తోంది అదితి.
ఇటీవల అదితి, మణిరత్నంకు ప్రపోజ్ చేస్తున్నట్టు రోజ్ ఫ్లవర్ ఇస్తుండగా ఆయన నవ్వుతూ ఆమె బుగ్గగిల్లుతున్న పిక్ ఒకటి బయటకొచ్చింది. అది కాస్తా కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కంట పడడంతో ట్విట్టర్లో షేర్ చేసాడు. ‘సూపర్ సీరియస్ మణిరత్నం సిగ్గుపడడం మొట్టమొదటిసారి చూస్తున్నాను’ అంటూ వర్మ ట్వీటాడు.
ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకో విశేషం ఏంటంటే ఏప్రిల్ 7న ఆర్జీవీ పుట్టినరోజు అలాగే మణిరత్నం దర్శకత్వంలో అదితి తొలిసారి నటించిన ‘చెలియా’ చిత్రం విడుదలై ఏప్రిల్ 7 నాటికి 3 సంవత్సరాలు అవుతోంది. అదితి తెలుగులో నటించిన ‘వి’ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
First time I ever saw the super serious Mani Ratnam blushing ? pic.twitter.com/P5RpLglPgv
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2020