Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు ఏకంగా 5 గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారా?

'టిల్లు స్క్వేర్' సినిమాకు ఏకంగా అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినట్లు తెలుస్తుంది.

Five Music Directors Worked for Siddhu Jonnalagadda Tillu Square Movie

Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడో ప్రకటించినా పలు మార్లు వాయిదా పడి ఈ నెల మార్చ్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ రిలీజ్ అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో డీజే టిల్లులో నటించిన నేహశెట్టి కాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్(Anupama Parameswaran) గా నటిస్తుంది.

అయితే ఈ సినిమాకు ఏకంగా అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినట్లు తెలుస్తుంది. డీజే టిల్లు సినిమాకు కూడా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్ కి మ్యూజిక్ ఇస్తే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆ సినిమాలో సాంగ్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 5 గురితో ఈ సినిమాకి మ్యూజిక్ ఇప్పించారట.

Also Read : Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. రూమర్స్ నమ్మొద్దు.. మంగ్లీ పోస్ట్ వైరల్..

శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల, అచ్చు రాజమణి.. ఈ ముగ్గురు సంగీత దర్శకులు పాటలకు సంగీతం అందిస్తుంటే, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అయితే కొత్తగా భీమ్స్ సిసిరోలియో కూడా ఈ సినిమాకి కొంత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో మొత్తం ఈ సినిమాకు అయిదుగురు సంగీత్ దర్శకులు పనిచేయడం విశేషం. ఒక చిన్న సినిమాకు, మీడియం రేంజ్ హీరో సినిమాకు అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టే. మరి డీజే టిల్లు హిట్ అయినట్టు టీలు స్క్వేర్ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు