Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. రూమర్స్ నమ్మొద్దు.. మంగ్లీ పోస్ట్ వైరల్..

రెండు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ అయినా ఇవాళ వైరల్ అవుతుండటంతో సింగర్ మంగ్లీ తన సోషల్ మీడియాలో స్పందించింది.

Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. రూమర్స్ నమ్మొద్దు.. మంగ్లీ పోస్ట్ వైరల్..

Singer Mangli Reacts on Her Accident News

Updated On : March 18, 2024 / 3:21 PM IST

Singer Mangli : టాలీవుడ్ సింగర్ మంగ్లీకి ప్రమాదం జరిగిందని ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రెండు రోజుల క్రింద జరిగిన ప్రమాదం. శనివారం రాత్రి హైదరాబాద్‌-బెంగళూర్‌ హైవే మీదుగా మంగ్లీ ఇంటికి వెళ్తుండగా ఒక డీసీఎం వేగంగా వచ్చి మంగ్లీ కారుని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గత శనివారం (మార్చి 16) అర్ధరాత్రి జరిగింది.

ఆల్రెడీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరు ఉండగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం వెనక భాగంలో డ్యామేజ్ అయ్యింది. ఇది రెండు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ అయినా ఇవాళ వైరల్ అవుతుండటంతో పాటు, మంగ్లీకి గాయాలు అయ్యాయి, చికిత్స తీసుకుంటుంది అని పలువురు ప్రచారం చేస్తుండటంతో దీనిపై సింగర్ మంగ్లీ తన సోషల్ మీడియాలో స్పందించింది.

Also Read : Harika Narayan : సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఫోటోలు చూశారా?

మంగ్లీ తన సోషల్ మీడియాలో.. నేను క్షేమంగా ఉన్నాను, ఇది రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి దీనిపై వచ్చే పుకార్లు నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. దీంతో మంగ్లీ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Mangli Singer (@iammangli)