2024 Celebrity Divorce : 2024లో విడిపోయిన సినీ సెలబ్రిటీలు వీళ్ళే..

2024 లో విడిపోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..

From AR Rahaman to Urmila Manodkar 2024 Indian Celebrities Divorces Details Here

2024 Celebrity Divorce : ఈ సంవత్సరం సినీ సెలబ్రిటీల్లో చాలా మంది పెళ్లిళ్లు జరిగాయి. అలాగే పలువురు సెలబ్రిటీలు విడిపోయారు కూడా. 2024 లో విడిపోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..

ఈ సంవత్సరం విడిపోయిన వాళ్ళల్లో హాట్ టాపిక్ గా మారింది మాత్రం సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, సైరా బాను దంపతులే. ఆల్మోస్ట్ 29 ఏళ్ళ పెళ్లి బంధం తర్వాత ఇటీవలే తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

తమిళ్ హీరో జయం రవి కూడా తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఆర్తి మాత్రం నాకు చెప్పలేదు, నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదంగా మారింది. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ విడిపోయినట్టే.

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, అతని భార్య సింగర్ సైంధవి కూడా తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్ నటి ఇషా డియోల్ తన భర్త భరత్ తో విడిపోతున్నట్టు ప్రకటించింది. 12 ఏళ్ళ వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ఇషా డియోల్ బాలీవుడ్ లెజెండరీ స్టార్స్ ధర్మేంద్ర – హేమమాలిని కూతురు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊర్మిళ మంటొద్కర్ 8 ఏళ్ళ వివాహ బంధం తర్వాత తన భర్త మెహిసిన్ అక్తర్ నుంచి విడాకులు కావాలని కేసు ఫైల్ చేసింది.

నటి నటాసా స్టాంకోవిక్, క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా ఈ సంవత్సరం విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.

హీరో ధనుష్ – ఐశ్వర్య గతంలోనే విడిపోయినా ఈ సంవత్సరం అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.