×
Ad

Funbucket Bhargav : మరోసారి జైలుకి వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్

బెయిల్ పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా

  • Published On : November 6, 2021 / 09:49 AM IST

Funbucket

Funbucket Bhargav :  టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు, అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమ‌స్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ గతంలో జైలుకి వెళ్ళాడు. 14 ఏళ్ల బాలికని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా నిలిచింది. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భార్గ‌వ్ బెయిల్ పై బయటకి వచ్చాడు. జైలు నుండి వచ్చిన భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ, పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియా వేదికగా కూడా తాను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేసాడు. కానీ నెటిజెన్స్ మాత్రం అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

SaiDharam Tej : ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను: సాయిధరమ్ తేజ్

భార్గవ్ కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ లభించింది. అయితే బెయిల్ పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమోలో పొందుపరిచారు పోలీసులు. దీంతో పోక్సో కోర్ట్ బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించడంతో మరో సారి జైలుపాలయ్యాడు భార్గవ్.