SaiDharam Tej : ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను: సాయిధరమ్ తేజ్

తాజాగా ఈ మెగా మేన‌ల్లుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. దీపావళి సందర్భంగా చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో పాటు మెగా హీరోలంతా కలిసి సాయి ధరమ్ తేజ్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు

SaiDharam Tej : ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను: సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej

Updated On : November 6, 2021 / 9:19 AM IST

SaiDharam Tej :  ఇటీవ‌ల యాక్సిడెంట్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లో జాయిన్ అయి నెల రోజులకి పైగా చికిత్స పొందిన తర్వాత ఇంటికొచ్చాడు సాయిధరమ్ తేజ్. అభిమానులు సాయిధరమ్ తేజ్ తొందరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఇంటికొచ్చినా కూడా ఇంకా ఎవరికీ అందుబాటులో లేకుండా రెస్ట్ తీసుకుంటున్నాడు. తాజాగా ఈ మెగా మేన‌ల్లుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. దీపావళి సందర్భంగా చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో పాటు మెగా హీరోలంతా కలిసి సాయి ధరమ్ తేజ్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అందరు మెగా హీరోలున్నా ఫోటో షేర్ చేసి అందరి ఆశీస్సులు ఫలించి మా సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండగా అని ట్వీట్ చేశారు.

Balakrishna : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

మెగా హీరోలున్నా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి పండగలాగే ఈ పండగని కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసిన ఈ పోస్ట్ రీ- ట్వీట్ చేస్తూ ”నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి, మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అని పోస్ట్ చేసాడు సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అయితే సినిమాలు మొదలు పెట్టడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు అని తెలుస్తుంది.