NTR30: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న తారక్, తన నెక్ట్స్ ప్రాజెక్టుగా తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ గతంలోనే వెల్లడించింది చిత్ర యూనిట్. అయితే రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు ఎన్టీఆర్ 30వ చిత్రం నుండి ఓ అప్డేట్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో, నందమూరి అభిమానులు ఈ అప్డేట్ కోసం సోషల్ మీడియాకు అతుక్కుపోయారు.
NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
అయితే వారి ఎదురుచూపులకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల అండ్ టీమ్ ఎన్టీఆర్ 30వ చిత్రం నుండి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ ప్లాట్‌ను ఓ పవర్ఫుల్ డైలాగ్ రూపంలో మనకు తెలియజేశారు చిత్ర యూనిట్. తారక్ బేస్ వాయిస్‌లో ‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా… ’’ అంటూ పవర్ఫుల్ డైలాగ్‌ను తారక్ చెప్పిన విధానంతో ప్రేక్షకులకు గూస్బంప్స్ వచ్చాయి. తారక్‌ను ఈసారి మరింత పవర్ఫుల్ పాత్రలో కొరటాల ప్రెజెంట్ చేయనున్నాడని ఈ అప్డేట్లోనే చెప్పేశాడు. అయితే ఈ వీడియో టీజర్ ను తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఒక్క మలయాళం తప్ప మిగతా అన్ని భాషల్లో తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.
NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!
ఇక ఒక చేతిలో కత్తి, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని తారక్ నిల్చున్న స్టిల్‌ను మనకు చూపించారు. మొత్తానికి కొరటాల ముందునుండీ చెబుతున్నట్లుగానే ఈసారి సాలిడ్ కథతో తారక్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే సినిమాతో వస్తున్నట్లు ఈ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక కథాపరంగా కూడా ఈ సినిమాను సరికొత్తగా చూపించబోతున్నాడట కొరటాల శివ. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తుండగా, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మరి తారక్ 30వ చిత్రానికి సంబంధించిన ఈ అప్డేట్ను మీరూ ఓసారి చూసేయండి.
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022