NTR : ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు ఒక ఎన్టీఆర్ మాత్రమే.. బాలీవుడ్ దర్శకుడు..!

ఆ పాత్రకు బాలీవుడ్ లోని ఏ యాక్టర్ న్యాయం చేయలేడు. ఒక ఎన్టీఆర్ మాత్రమే ఆ రోల్ కి పూర్తి న్యాయం చేయగలడు అంటున్న..

Gadar 2 director Anil Sharma comments on NTR acting

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి టాలీవుడ్ వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక RRR మూవీతో తన యాక్టింగ్ ని బాలీవుడ్ వాళ్ళకి కూడా రుచి చూపించాడు. మరి తారక్ నటన చూసిన తరువాత పొగడని వారు, తనతో కలిసి పని చేయాలనీ అనుకోని వారు ఉంటారా..? ఈక్రమంలోనే ఆల్రెడీ వార్ 2 (War 2) వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కూడా భాగం కావాలంటూ మేకర్స్ సంప్రదించడం, ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయింది. తాజాగా ఒక బాలీవుడ్ దర్శకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kushi Movie Collections : ఖుషి సెకండ్ డే కలెక్షన్స్.. యాదాద్రిలో కుటుంబంతో సహా విజయ్ పూజలు..

సన్నీ డియోల్ యాక్ట్ చేసిన గదర్ 2 (Gadar 2) బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న నిర్మించిన ఈ చిత్రం 60 కోట్లతో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ఇటీవల సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్స్ తో పాటు దాదాపు బాలీవుడ్ మొత్తానికి భారీ పార్టీ ఇచ్చారు చిత్ర యూనిట్. కాగా అనిల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ‘గదర్ 2 మూవీలో సన్నీ డియోల్ పోషించిన తారాసింగ్ పాత్రని ఇప్పుడున్న జనరేషన్ నటుల్లో ఎవరు చేయగలరని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.

Chinmayi : సమంత పై వచ్చే ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే..

అనిల్ శర్మ బదులిస్తూ.. “బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు లేరు. సౌత్ ఇండస్ట్రీ నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. తన యాక్టింగ్ సత్తాతో ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగలడు” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వార్ 2తో బి-టౌన్ లో ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ ని సొంత చేసుకుంటాడో అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు