×
Ad

Gadar 2 : కొత్త పార్లమెంట్‌లో ప్రదర్శించబోయే మొదటి సినిమా ఇదే.. థియేటర్స్ లో రికార్డ్స్.. ఇప్పుడు మరింత గౌరవం..

గదర్ 2 సినిమా హిట్ తో బాలీవుడ్ కి మరింత జోష్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో గౌరవం అందుకుంది

  • Published On : August 26, 2023 / 02:01 PM IST

Gadar 2 Movie Screening in New Parliament House creates new record as first film screening in New Parliament House

Gadar 2 Movie : బాలీవుడ్(Bollywood) లో ఇటీవల సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 వచ్చింది. అమీషా పటేల్(Ameesha Patel) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాకిస్థాన్- ఇండియా బోర్డర్ కథతో పాటు ఓ ప్రేమకథని కూడా కలిపి ఎమోషనల్ గా తెరకెక్కించారు.

ఆగస్టు 11న థియేటర్స్ లో రిలీజయిన గదర్ 2 సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఎవరూ ఊహించనంతగా గదర్ 2 సినిమా మంచి విజయం సాధించింది. గదర్ 2 సినిమా కేవలం రెండు వారాల్లోపే 400 కోట్ల క్లబ్ లోకి చేరింది. అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా 425 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 500 కోట్లకు దూసుకుపోతుంది. ఈ సినిమాని 100 కోట్లతో తెరక్కించగా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.

గదర్ 2 సినిమా హిట్ తో బాలీవుడ్ కి మరింత జోష్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో గౌరవం అందుకుంది. కొన్ని మంచి మంచి సినిమాలని పార్లమెంట్ లో స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల కోసం మంచి సినిమాలని పార్లమెంట్ లో స్క్రీనింగ్ చేస్తారు. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం నిర్మించిన సంగతి తెలిసిందే.

Arjun – Malaika : బాలీవుడ్ హాట్ కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారా?

కొత్త పార్లమెంట్ నిర్మించిన అనంతరం పార్లమెంట్ లో మొట్ట మొదటి సినిమాగా గదర్ 2 సినిమాని స్క్రీనింగ్ చేయనున్నారు. మూడు రోజుల పాటు గదర్ 2 సినిమాని పార్లమెంట్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. నిన్న ఆగస్టు 25 నుంచి రేపు ఆగస్టు 27 వరకు సినిమా స్క్రీనింగ్ జరుగుతుంది. దీంతో నూతన పార్లమెంట్ లో మొదటిసారిగా ప్రదర్శించిన సినిమాగా గదర్ 2 కొత్త రికార్డ్ సెట్ చేసింది.